Hyderabad, జూలై 18 -- మలయాళ మూవీ 'రోంత్' (Ronth) త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్ వచ్చే వారం నుండి ఐదు భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. నైట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఒక రాత్రిలో జరిగే స్టోరీ ఇది. మలయాళంలో రోంత్ అంటే గస్తీ అని అర్థం.

మలయాళం స్టార్ నటులైన రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ రోంత్. ఈ పోలీస్ డ్రామా, థియేట్రికల్ రన్ విజయవంతం అయిన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. వచ్చే మంగళవారం (జులై 22) నుండి 'రోంత్' మూవీ జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. "గస్తీ ప్రారంభం కానుంది. రోంత్ జులై 22 నుంచి జియోహాట్‌స్టార్ లో...