భారతదేశం, సెప్టెంబర్ 26 -- భారతీయ రోడ్లపై అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా మారుతీ సుజుకీ ఇన్విక్టో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎంపీవీ నిలిచింది. ఈ వాహనం భారత్ ఎన్​సీపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది!. ఈ ఘనత సాధించిన మారుతీ వాహనాల్లో డిజైర్ సెడాన్, కొత్తగా విడుదలైన మారుతీ విక్టోరిస్‌ల సరసన ఇన్విక్టో కూడా చేరింది.

మారుతీ సుజుకీ ఇన్విక్టో వయోజన ప్రయాణికుల భద్రత (అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​): 32 పాయింట్లకు గానూ 30.43 పాయింట్లు సాధించింది.

పిల్లల భద్రత (చైల్డ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​): 49 పాయింట్లకు గానూ 45 పాయింట్లు సాధించింది.

ఈ అధిక స్కోర్‌లు ఇన్విక్టోను భారతీయ రోడ్లపై అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా చేశాయి. ఇన్విక్టో శ్రేణిలోని అన్ని మూడు వేరియంట్‌లకు ఈ 5-స్టార్ రేటింగ్ వర్తిస్తుంది!

మారుతీ సుజుకీ ఎండీ అండ్​ సీఈఓ ఏమ...