భారతదేశం, ఫిబ్రవరి 3 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. దాంతో అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు కలుగుతాయి. దీంతో ఒక్కసారిగా జీవితం కూడా మారిపోతుంది. మరి కొన్ని రోజుల్లో, అంటే ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో సంచారం చేయడంతో సూర్య, రాహువుల సంయోగం ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. మార్చి మధ్య వరకు ఈ యోగం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో ఉండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే...