Hyderabad, జూలై 9 -- థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత తెలుగు బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ శారీ (Saaree) రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. గత నెల 27 నుంచి ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాను ఆర్జీవీ సమర్పించిన విషయం తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వచ్చిన సినిమా శారీ. ఈ ఏడాది ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైంది. అతని ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్ ఈ సినిమా. ఈ మధ్యకాలంలో వర్మ చాలా సినిమాల్లాగే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. జూన్ 27 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక శుక్రవారం (జులై 11) నుంచి ఆహా వీడియో ఓటీటీలోనూ రానుంది. "అతడు ఆమెను చీరలో చూసి.. మతిస్థిమితం కోల్పోయాడు. ప్రేమగా మొదలైనది ఒక వ్యామోహంగా మారింది. ఆమ...