భారతదేశం, జూన్ 14 -- తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'తరుణం' థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కిషన్ దాస్, స్మృతి వెంకట్, రాజ్ అయ్యప్ప లీడ్ రోల్స్ చేయగా.. అరవింద్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే ఓ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

తరుణం సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 20వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఇప్పుడు ఆహా తమిళ్‍లోనూ అడుగుపెట్టనుంది. రెండో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

టెంట్‍కొట్టాలో స్ట్రీమింగ్ తర్వాత తరుణం మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలే వచ్చాయి. స్టోరీ పాయింట్ బాగున్నా.. సాగదీతగా అనిపించి...