భారతదేశం, జూన్ 3 -- అల్లరి నరేశ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం గతేడాది మే 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కొన్నేళ్ల తర్వాత తన మార్క్ కామెడీ చిత్రాన్ని నరేశ్ చేయడంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ రిలీజయ్యాక ఈ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . దీంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఓ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రం మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ సినిమా గతేడాది మే చివర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ మూవీ మరో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈటీవీ విన్‍లో జూన్ 12న స్ట్రీమింగ్‍కు ఎం...