భారతదేశం, ఫిబ్రవరి 1 -- సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన 'కమ్యూనల్' వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా ఆయన ఓ షోలో కనిపించారు. కపిల్ శర్మ నిర్వహించే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో రెహమాన్ పాల్గొన్నారు. ఈ షోలో విస్పర్ గేమ్‌ (whisper game) సమయంలో రెహమాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' తాజా ఎపిసోడ్‌లో రెహమాన్ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చారు. ఒక సెగ్మెంట్‌లో ఈ ఆస్కార్ విజేత మాట్లాడుతూ సమాచారం, సందేశాలు ఎలా వక్రీకరణకు గురవుతాయో తెలిపారు.

''సమాచారం ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో మాట్లాడేందుకు ఇదో మంచి అవకాశం. విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులున్నాయి. అందుకే ఒకరు చెప్పింది మరొకరిగా తప్పుగా అర్థమవుతుంది. అదే ప్రపంచ సమస్య'' అని రెహమాన్ అన్నారు.

తన తాజా సినిమా ప్రచారం కోసం రెహమాన...