భారతదేశం, మే 7 -- ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. యాంకర్ ప్రదీప్ చిత్రం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. వేర్వేరు ఓటీటీల్లో ఈ సినిమాలు రానున్నాయి. ఆ వివరాలు ఇవే..

తెలుగు యాక్షన్ కామెడీ మూవీ 'జాక్' రేపు (మే 8) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అర్ధరాత్రే అంటే మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‍ షూరూ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించా...