Hyderabad, ఏప్రిల్ 23 -- ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా సినిమాలు, వెబ్ సిరీసే ఉన్నాయి. అయితే సాధారణంగా శుక్రవారం వచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈసారి గురువారమే (ఏప్రిల్ 24) అడుగుపెడుతున్నాయి. వీటిలో ఒకటి మలయాళం మూవీ ఎల్2: ఎంపురాన్ కాగా.. మరొకటి తమిళ సినిమా వీర ధీర శూరన్. రెండూ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాదించినవే కావడం విశేషం.

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించిన ఎల్2: ఎంపురాన్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 24) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే బుధవారం అర్ధరాత్రి 12 దాటగానే ఈ సినిమా అందుబాటులోకి కాబోతోంది. ఈ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.270 కోట్లు వసూలు చేసింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్. ప...