భారతదేశం, ఫిబ్రవరి 5 -- భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చి నిరాశపర్చిన హారర్ ఫాంటసీ మూవీ 'ది రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది.

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ వ్యూయర్స్ కు ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో సినీ లవర్స్ కు జియోహాట్‌స్టార్ ఓ అదిరిపోయే న్య...