Hyderabad, జూన్ 4 -- తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన తొలి హిందీ మూవీ జాట్ (Jaat). ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

తెలుగులో డాన్ శీను, బలుపు, క్రాక్, వీర సింహారెడ్డిలాంటి సినిమాలను తీసిన గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతోంది. గురువారం (జూన్ 5) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ బుధవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

నిజానికి శుక్రవారం (జూన్ 6) నుంచి వస్తుందని భావించినా.. ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కాబోతోంది. "జాట్ సెట్ గో. మాస్ యాక్షన్, డ్రామా, రెండున్న కిలోల చేయి తీసుకొని జాట్ వ...