Hyderabad, మే 22 -- ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి చాలా కంటెంటే అందుబాటులో ఉండనుంది. తాజాగా ఒకే ఓటీటీలోకి ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ, తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమాలు రాబోతున్నాయి. తెలుగు మూవీ రెండు నెలల తర్వాత, తమిళ మూవీ నెల రోజుల్లోపే ఈ ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ రెండు మూవీస్ శుక్రవారం (మే 23) నుంచే స్ట్రీమింగ్ కానున్నాయి.

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి శుక్రవారం (మే 23) ఈ రెండు మూవీస్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు థ్రిల్లర్ సినిమా వైరల్ ప్రపంచం (Viral Prapancham). మార్చి 7న థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. ఈ మూవీ స్ట్రీమింగ్ పై గురువారం (మే 22) ఆ ఓటీటీ వరుస ట్వీట్స్ చేసింది.

"ఎదురుచూపులు ముగియబోతున్నాయి. వేగంగా కూలిపోయే ప్రపంచాన్ని చూడాటానికి సిద్ధంగా ఉన్నారా? దానిని చూడటం తప్ప ఏమీ చేయలేం. దీనిని ఓ వార్నింగ్ లా భావించండి. మీరు ఎవరిని నమ్ముతున్నార...