భారతదేశం, ఫిబ్రవరి 11 -- వారానికి 70 గంటలు పనిచేయాలి, 90 గంటలు పనిచేయాలంటూ కంపెనీ ఓనర్లు, సీఈఓలు- ఎండీలు వార్తల్లో నిలుస్తున్న ఈ కాలంలో.. లులు గ్రూప్​ ఛైర్మన్​ హృదయాలను గెలుచుకుంటున్నారు! మరణించిన ఉద్యోగి శవపేటికను మోస్తున్న లులు గ్రూప్​ ఛైర్మన్​ ఎంఏ. యూసుఫ్​ అలీ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే..

ఎంఏ. యూసుఫ్ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేసిన ఈ వీడియోకి ఇప్పుడు, ఇది ఒక లక్షకు పైగా వ్యూస్​ వచ్చాయి. వైరల్ వీడియో ప్రకారం.. షిహాబుద్దీన్ అనే వ్యక్తి అబుదాబిలోని అల్ వహ్దా మాల్ లులు హైపర్ మార్కెట్​లో సూపర్​వైజర్‌గా పనిచేశాడు. ఆయన తిరుర్ కన్మనంకు చెందినవాడు. కాగా గుండెపోటు కారణంగా ఆయన ఇటీవలే మరణించాడు. ఫ్యూనరల్​లో పాల్గొన్న యూసుఫ్​.. తన ఉద్యోగి శవపేటికను మోశారు.

"గుండెపోటుతో మరణించిన అబుదాబి అల్ వహ్దా మాల్ లులు ...