భారతదేశం, మే 17 -- ఈ మే మూడో వారంలో వివిధ ఓటీటీల్లోకి మూడు మలయాళ చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణమాస్ మంచి క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మరో రెండు మలయాళ సినిమాలు కూడా ఇదే వారం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. వివరాలివే..

బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన మరణమాస్ సినిమా ఈవారంలోనే సోనీ లివ్ ఓటీటీలో ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మలయాళ డార్క్ కామెడీ సినిమా.. ఈ వారం మే 14న సోనీ లివ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మరణమాస్ సినిమా ఓ సీరియల్ కిల్లర్, యూట్యూబర్ చుట్టూ సాగుతుంది. ఈ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. క్రైమ్ టచ్‍తో డార్క్ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కి.. ప్రేక్షకుల...