భారతదేశం, జనవరి 30 -- మన శంకరవరప్రసాద్ గారు.. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇండియాలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 18 రోజుల్లో ఈ మూవీ ఇండియాలోనే ఏకంగా రూ.201.95 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తారా అన్నదీ సందేహమే. మరి దీనిపై మూవీ టీమ్, ఓటీటీ ప...