Hyderabad, జూన్ 27 -- కన్నప్ప మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు తమ్ముడు, మోహన్ బాబు చిన్న కొడుకు, నటుడు మంచు మనోజ్ కూడా ఈ సినిమా అద్భుతమని కొనియాడాడు. తాను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు బాగుందని అతడు అనడం విశేషం. అన్న పేరు ఎత్తకుండానే అతని నటన కూడా అద్భుతమని పరోక్షంగా చెప్పాడు.

మంచు మనోజ్ శుక్రవారం (జూన్ 27) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కన్నప్ప మూవీ చూశాడు. ఐదు నిమిషాలు ఆలస్యంగా అతడు థియేటర్లోకి వెళ్లాడు. ఆ ఐదు నిమిషాల కోసం రేపు మరోసారి సినిమా చూస్తానని కూడా అతడు మీడియాతో అనడం విశేషం. ఈ సినిమా చాలా చాలా బాగుందని, లీడ్ రోల్స్ అందరూ అద్భుతంగా చేశారని మనోజ్ స్పష్టం చేశాడు. తన అన్న, తండ్రి పేర్లు అతని నోటి వెంట రాలేదు కానీ.. పరోక్షంగా వాళ్లను కూడా అతడు ప్రశంసించాడు.

"కన్నప్ప చూశాన...