Hyderabad, మే 2 -- మలయాళం సినిమాలు చాలా వరకు భారీ బడ్జెట్, యాక్షన్ సీన్స్, అనవసర హంగామా జోలికి వెళ్లవు. ఓ చిన్న లైన్ అనుకొని, దాని చుట్టూ కథను అల్లి, చివరి వరకూ మంచి థ్రిల్ పంచుతూ సినిమాలు తీయడంలో ఆ ఇండస్ట్రీ మేకర్స్ దిట్ట. అలా 2022లోనూ నైట్ డ్రైవ్ అనే ఓ మంచి థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులకు అందించారు.

నైట్ డ్రైవ్ 2022లో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇంద్రజీత్ సుకుమారన్, రోషన్ మాథ్యూ, ఎనా బెన్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. వైశాఖ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నీతా పింటో, ప్రియా వేణు నిర్మించారు. ఈ సినిమా మొత్తం ఒకే రాత్రిలో జరిగే కథగా చిత్రీకరించారు. ఓ యువ జంట నైట్ డ్రైవ్, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఓ మంత్రి దగ్గర ఉన్న కిలోల కొద్దీ బంగారం చుట్టూ తిరిగే మూవీ ఇది.

ఇంట్లో కిలోల కొద్దీ బంగారం దాచుకున్న కేరళ రాష్ట్ర మంత్రి రాజన్ కురు...