భారతదేశం, ఏప్రిల్ 4 -- కర్ణాటకలో క్రైమ్​ థ్రిల్లర్​ సినిమాని తలపించేలా జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. భార్యను చంపిన ఆరోపణలతో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా జైలులోనే ఉంటున్నాడు. కానీ సదరు మహిళ, తాజాగా మరో వ్యక్తితో దర్శనమిచ్చింది! చివరికి ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. అసలు కథ ఏంటంటే..

కర్ణాటక కుషాల్​నగర్​కు చెందిన మల్లిగె అనే మహిళ 2020లో అదృశ్యమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు బెట్టదపుర అనే ప్రాంతంలో ఓ మహిళ అస్తిపంజరాలు కనిపించాయి. అవి మల్లిగెవే అని భావించిన పోలీసులు.. ఆ మహిళ భర్త సురేశ్​ ఆమెను చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురేశ్​ తన భార్యను చంపి, మృతదేహాన్ని ఎవరూ లేని చోట పాతిపెట్టాడని పోలీసులు ఛార్జ్​షీట్​ కూడా ఫైల్​ చేశారు. సురేశ్​ అప్పటి నుంచి...