భారతదేశం, జూన్ 30 -- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​) ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు హెచ్​పీసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఫ్రెషర్‌లు జూన్ 30, 2025 సోమవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్​పీరియెన్స్​ ఉన్న అభ్యర్థులకు చివరి తేదీ జులై 15, 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

హిందుస్థాన్ పెట్రోలియం రిక్రూట్​మెంట్ 2025 రిజిస్ట్రేషన్​ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఫ్రెషర్‌ల కోసం:

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ - 10 ఖాళీలు (పే స్కేల్: రూ. 30,000 - 1,20,000)

అర్హత: కనీసం ఒక సంవత్సరం పూర్తికాల సాధారణ గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో).

జూనియర్ ఎగ్జిక్యూటివ్ - సివిల్ - 50 ఖాళీలు (పే స్...