భారతదేశం, జూన్ 20 -- ఇజ్రాయెల్-ఇరాన్, అమెరికా - ఇరాన్ ల మద్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 జూన్ 20 శుక్రవారం ఘనమైన లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 81,361.87 వద్ద ప్రారంభమై, 1,133 పాయింట్లు లేదా 1.4 శాతం పెరిగి 82,494.49 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 24,787.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 1.4 శాతం పెరిగి 25,136.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 1,046 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 82,408.17 వద్ద, నిఫ్టీ 319 పాయింట్లు లేదా 1.29 శాతం లాభంతో 25,112.40 వద్ద స్థిరపడ్డాయి. బిఎస్ ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం పెరిగాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు రూ.443 లక్షల కోట్ల ను...