భారతదేశం, మే 15 -- అమెరికా, చైనా ల వాణిజ్య ఒప్పందం కుదరనుందన్న వార్తల నేపథ్యంలో, బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ తీవ్రంగా ఉన్న సమయంలో రికార్డు స్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరం రూ. 1 లక్ష దాటిన విషయం తెలిసిందే. కాగా, భారత్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం, మే 15వ తేదీన రూ. 93,930 గా ఉంది. ఇది నిన్నటి ధర అయిన రూ. 96,060 కన్నా రూ. 2,130 తక్కువ. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం, మే 15వ తేదీన రూ. 86,100 గా ఉంది. ఇది నిన్నటి ధర అయిన రూ. 88,050 కన్నా రూ. 1950 తక్కువ.

గత వారం రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లించడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. చైనా, అమెరికాలు పరస్పరం 115 శాతంగా ఉన్న ...