భారతదేశం, మే 3 -- భారత్ తో పోరు తప్పదని పాక్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్ ఇండస్ లో భాగంగా 450 కిలోమీటర్ల పరిధి గల అబ్దాలీ వెపన్ సిస్టం అనే క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. మరోవైపు, ఆయుధ వ్యవస్థలను భారత్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి భారత్ పైకి కాల్పులను దాదాపు ప్రతీరోజు కొనసాగిస్తోంది.

భారత్, పాక్ ల మధ్య యుద్ధం జరిగే పరిస్థితుల నేపథ్యంలో, పీఓకే ప్రజలు కనీసం రెండు నెలలకు సరిపడా ఆహార పదార్ధాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు అక్కడి ప్రజలకు సూచించారు. మరోవైపు, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను పాక్ తాత్కాలికంగా మూసేసినట్లు తెలుస్తోంది. అలాగే, అక్కడి ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన వ్యూహాత్మక లక్షణాలతో సహా దళాల కార్యాచ...