భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి 'సుంకాల' దాడి చేశారు. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు 'భారత్‌కు శిక్ష' అంటూ.. అదనంగా 25 శాతం టారీఫ్​ని విధించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఫలితంగా.. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ఈ అదనపు సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఉన్న సుంకాలు ఆగస్టు 7న, అంటే గురువారం అమల్లోకి రానున్నాయి.

ఈ అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులకు భారీగా ధర పెరుగుతుంది. దీని ప్రభావం ముఖ్యంగా ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఉంటుంది.

ఉక్కు, రసాయనాలు, ఫార్మా రంగాలపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిశ్రమలు భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొనే...