భారతదేశం, సెప్టెంబర్ 26 -- మహీంద్రా సంస్థ ఇటీవల విడుదల చేసిన బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ డెలివరీలు తాజాగా మొదలయ్యాయి. డీసీ కామిక్స్​కి చెందిన ప్రఖ్యాత సూపర్ హీరో, 'ది డార్క్ నైట్'కు నివాళిగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక మోడల్, కేవలం 999 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఎక్స్-షోరూమ్ ధర రూ. 27.79 లక్షలు ఉన్న ఈ ప్రత్యేక ఎస్​యూవీని కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు!

స్టాండర్డ్ బీఈ 6 ప్యాక్ త్రీ ట్రిమ్‌పై రూపొందించిన ఈ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్... ఆకట్టుకునే డిజైన్ అప్‌గ్రేడ్‌లు, సూపర్ హీరో-ప్రేరిత వివరాలు, ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లతో వచ్చింది. స్టాండర్డ్ బీఈ 6 బలమైన పనితీరును, లాంగ్ రేంజ్‌ను ఇది యథావిధిగా కలిగి ఉంది. డెలివరీలు మొదలవడంతో, బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అధికారికంగా భారతీయ రోడ్లపైకి వచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ఉ...