భారతదేశం, జూన్ 4 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అయిన ఏథర్​ రిజ్టాపై బిగ్​ అప్డేట్​! ఈ ఈ-స్కూటర్​ని లాంచ్ చేసిన ఏడాదిలోనే భారత మార్కెట్​లో లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సంస్థ ప్రకటించింది. రిజ్టా అనేది.. బ్రాండ్​కి మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. గత ఏడాది లాంచ్ అయిన తర్వాత ఏథర్ మొత్తం అమ్మకాల పరిమాణంలో రిజ్టా వాటా 60 శాతంగా ఉందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏథర్​ రిజ్టా వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

ఏప్రిల్ 2024లో ఏథర్ కమ్యూనిటీ డే నాడు రిజ్టాను మొదటిసారిగా ఆవిష్కరించింది సంస్థ. దేశవ్యాప్తంగా జూన్ 2024 నుంచి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రిటైల్స్ ప్రారంభమయ్యాయి.

దేశ 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో ఏథర్​ తన మార్కెట్​ షేరును పెంచుకునేందుకు ఈ రిజ్టా దోహదపడింది. 2025 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంలో డెలి...