భారతదేశం, జూలై 18 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్ నుంచి బిగ్​ అప్డేట్​! ఈ కారు.. కేవలం నాలుగు సంవత్సరాలలోనే ఆరు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అందుకుంది. ఈ మైలురాయిని ఇంత వేగంగా దాటిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది. టాటా పంచ్ 2021లో పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో లాంచ్​ అయ్యింది. 2024లో పంచ్ ఈవీ (ఎలక్ట్రిక్ వెర్షన్) కూడా విడుదల అయింది.

పంచ్ మొదటి లక్ష యూనిట్లు 2022 ఆగస్టు నాటికి ఉత్పత్తి అయ్యాయి. ఆ తర్వాత మే 2023 నాటికి మరో లక్ష యూనిట్లు రెడీ అయ్యాయి. డిసెంబర్ 2023 నాటికి పంచ్ మూడు లక్షల ఉత్పత్తి మార్కును అందుకుంది. ఇక జులై 2024 నాటికి నాలుగు లక్షల ఉత్పత్తి మార్కును, జనవరి 2025 నాటికి ఈ ఎస్‌యూవీ ఐదు లక్షల ఉత్పత్తి మార్కును అధిగమించింది.

ఈ అసాధారణ ప్రయాణానికి గుర్తుగా, టాటా మోటా...