భారతదేశం, జూన్ 29 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్​ ఈవీపై మరో బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​ 2024 సెప్టెంబర్​లో లాంచ్​ అవ్వగా, తాజాగా 27000 సేల్స్​ మైలురాయిని దాటింది. తొలుత ఈ ఈవీ చిన్న 38 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. అయితే మే 2025లో పెద్ద 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్​ ఈవీ ప్రో వేరియంట్‌ను ఎంజీ విడుదల చేసింది. అంతేకాదు, కొత్త వేరియంట్ ప్రారంభించిన 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లు సాధించిందని కంపెనీ ప్రకటించడం విశేషం.

మెట్రో నగరాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి కూడా ఎంజీ విండ్సర్​ ఈవీకి బలమైన డిమాండ్ కనిపిస్తుండటం హైలైట్​! ఈ ఎలక్ట్రిక్​ కారు మొత్తం అమ్మకాల్లో నాన్-మెట్రో నగరాల వాటా దాదాపు 48 శాతం ఉందని కార్ల తయారీ సంస్థ తెలిపింది.

ఎంజీ విండ్సర్​ ఈవీ అ...