భారతదేశం, ఆగస్టు 17 -- పండుగ సీజన్​కి ముందు అటు ఆటోమొబైల్​ సంస్థలు, ఇటు వాహనదారులకు గుడ్​ న్యూస్​ అందే అవకాశం ఉంది! వస్తువు సేవల పన్ను (జీఎస్టీ) లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్న నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాల ధర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.​

భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రణాళికను ప్రకటించారు. దేశీయ డిమాండ్‌ను పెంచడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు వాహనాలను అందుబాటులోకి తేవడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం చాలా వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 శాతం చొప్పున పన్ను విధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పన్ను స్లాబులను కేవలం రెండు విస్తృత కేటగిరీలుగా - స్టాండర్డ్ (18 శాతం), మెరిట్ (5 శాతం) - మార్చాలని యోచిస్తోంది! దీని వల్ల ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉ...