భారతదేశం, ఫిబ్రవరి 2 -- టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఒవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.

సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన 'హనీ' ఫిబ్రవరి 6న థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా హనీ ట్రైలర్ రిలీజ్ చేశారు. హారర్ సీన్స్‌తో భయపెట్టేలా హనీ ట్రైలర్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. హనీ ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్ర...