Hyderabad, సెప్టెంబర్ 26 -- తెలుగులో సెప్టెంబర్ లో సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్ లిటిల్ హార్ట్స్ (Little Hearts). ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.33.8 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే దసరాకు ఒక రోజు ముందే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అది కూడా ఎక్స్‌టెండెడ్ కట్ తో కావడం విశేషం. అంటే థియేటర్లలో లేని సీన్లు కూడా ఓటీటీలో ఉండబోతున్నాయి.

"ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మీ ఇంటికి వస్తోంది. ఈసారి పెద్దగా, స్వీటుగా, క్రేజీగా ఉండనుంది. లిటిల్ హార్ట్స్ (ఎక్స్‌టెండెడ్ కట్). ...