భారతదేశం, మే 13 -- రాజ్‌తో క‌లిసి దుగ్గిరాల ఇంటికొస్తుంది యామిని. ఆమెను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ షాక‌వుతారు. నేను క‌ళావ‌తి ఫ్రెండ్‌ను అంటూ త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుంటుంది యామిని. నా కంటే నాకు కాబోయే భ‌ర్త రామ్...క‌ళావ‌తికి మంచి ఫ్రెండ్ అని అంటుంది. త్వ‌ర‌లోనే రామ్ తాను పెళ్లిచేసుకోబోతున్నామ‌ని, మొద‌టి శుభ‌లేఖ రామ్ క్లోజ్‌ఫ్రెండ్ అయిన క‌ళావ‌తికి ఇవ్వ‌డానికే వ‌చ్చాన‌ని అంటుంది.

కానీ క‌ళావ‌తి కంటే పెద్ద‌వాళ్లుగా మీరంద‌రూ ఉన్న‌ప్పుడు మీకే ఇవ్వ‌డం మంచిద‌ని అనిపిస్తుంద‌ని పెద్ద ఇందిరాదేవికి త‌మ పెళ్లి మొద‌టి శుభ‌లేఖ అందిస్తుంది యామిని. త‌మ‌ను ఆశీర్వ‌దించాల‌ని ప‌ట్టుప‌డుతుంది. దీర్షాయుష్మాన్‌భ‌వ అని యామిని, రాజ్‌ల‌ను ఆశీర్వ‌దిస్తారు ఇందిరాదేవి, సీతారామ‌య్య‌. శ్రీఘ‌మేవ క‌ళ్యాణ‌ప్రాప్తిర‌స్తు అని క‌దా దీవించాలి యామిని లాజిక్‌లు ...