Hyderabad, సెప్టెంబర్ 29 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నేను కావాలా, ఆ బిడ్డ కావాల తేల్చుకో అని రాజ్ అంటే.. నాకు బిడ్డే కావాలి. మీకన్న నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డ కోసం ఆ దేవుడిని కూడా ఎదురించడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య వెళ్లిపోతుంది. రాజ్ కూడా వెళ్లిపోతాడు. వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంకా ఏదో కారణం ఉందని అపర్ణ అంటుంది.

మరోవైపు రాజ్‌తో నిజం చెప్పమని, కనీసం ఇంట్లోవాళ్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని కల్యాణ్ అంటాడు. ప్రాణం పోయిన పర్లేదు. బిడ్డకు ప్రాణం పోసే తీరుతానని కళావతి అంటుంది అని రాజ్ అంటాడు. కానీ, డాక్టర్ తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేయకూడదన చెప్పారుగా. చెప్పకుండా ఎలా చేస్తావ్ అని కల్యాణ్ అంటే.. దానికి నేను ఓ ప్లాన్ చేశాను అని బయటకు వెళ్తాడు రాజ్.

ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి తన ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ ర...