Hyderabad, సెప్టెంబర్ 10 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 822వ ఎపిసోడ్ ఉత్కంఠ రేపేలా సాగింది. దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ సందర్భంగా తీర్థంలో కడుపు పోగొట్టే ట్యాబ్లెట్లను రుద్రాణి కలపడం, అది కావ్య తీసుకోబోతుండగా అనుకోకుండా స్వరాజ్ కాపాడటం, ఆ తర్వాత రేవతిని ఎలాగైనా ఇరికించేందుకు రుద్రాణి ప్లాన్స్ చేయడంలాంటివి చూడొచ్చు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ రుద్రాణితో స్వరాజ్, కనకం ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. తీర్థంలో పౌడర్ కలిపి వెనక్కి తిరిగే సరికి ఆ ఇద్దరూ రుద్రాణినే చూస్తుంటారు. దీంతో వీళ్లు చూసేశారా ఏంటి అంటూ కంగారు పడుతుంది. డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలుచుకునే స్వరాజ్, కనకం మాత్రం ఏం చేస్తున్నావ్ అని నిలదీస్తారు.

మా ఫ్రెండు నేను ఈ ఇంటి వారసుడిని.. నేను ఏం అడిగినా ఇవ్వమని చెప్పింది కదా.. మరి నువ్వు జ్యూస్ ఎందుకు ఇవ్వలేదని...