Hyderabad, మే 15 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌ను కావ్య పంపించేస్తుంది. తర్వాత ఇంట్లోవాళ్ల దగ్గరికి వెళ్లి కావ్య నిలదీస్తుంది. ఎందుకు ఆయనకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రిసార్టులో ఏం జరిగిందే మర్చిపోయారా అని కావ్య గట్టిగా అంటుంది. అందుకే జాగ్రత్త తీసుకుంటున్నాం. అలాంటిది జరగకుండా నీకు దగ్గర చేస్తున్నాం అని అపర్ణ అంటుంది.

అయ్యో అత్తయ్య.. ఆయన నాకు దగ్గర అవ్వడమే అసలు సమస్య అని కావ్య అంటుంది. అది సమస్య కాదు వాడికి గతం గుర్తుకు రాక ప్రస్తుతంలో బతకలేక నరకం అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు యామినిని వద్దనుకుని వదిలేశాడు. ఇప్పుడు అవి గుర్తులేక యామినిని ఇష్టం లేక నీకు దగ్గరవుతున్నాడు అని ఇందిరాదేవి అంటుంది. ఏం చేసిన ఆయనకు గతం గుర్తుకు రాకపోతే అని కావ్య అడుగుతుంది.

ఏముంది ఇంతకుముందు కావ్యగా వాడితో ఉన్నావ్. రేపటి నుంచి కళావతిగా కొత్...