భారతదేశం, ఫిబ్రవరి 6 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధర్మేంద్ర భార్యకు ఎప్పుడు నిజం చెబుతామో అని భయపడుతున్నాడని రాజ్ అంటాడు. భార్యను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించుతాడనిపిస్తోందని కావ్య అంటుంది.

అలాంటి వాడికి తెలివితోనే బుద్ధి చెప్పాలని, తెగింపు కోసం ఒక మెట్టు మనమే ఎక్కువ ఉంటాం. వాడిది ఆరాటం మనది పోరాటం. తల్లి అనురాగం ముందు వాడు ఓడిపోక తప్పదు. ఈరోజు నుంచి వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూస్తూ ఉండూ అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్య పాప గురించి ధర్మేంద్రను అడిగితే షాక్ అవుతాడు. కవర్ చేసి వెళ్లిపోతాడు.

తర్వాత గుడిలో తులసిని కావ్య కలుస్తుంది. అది చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. రోజులు గడుస్తుంటాయి. ధర్మేంద్ర, తులసి భోజనం చేస్తుంటే కావ్య వస్తుంది. తులసి లేచి వెళ్లి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్‌పై కావ్యను కూర్చోపెడుతుంది. మంత్రి ధర్మేంద్ర ఇ...