భారతదేశం, ఫిబ్రవరి 5 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ భయపెట్టడంతో మంత్రి ధర్మేంద్ర డాక్టర్ చక్రవర్తిని కిడ్నాప్ చేసి పెట్టిన చోటుకు వెళ్తాడు. ఈ చుట్టు పక్కలకు ఎవడు వచ్చిన చింపేయండి. వీడు ఎవడికి దొరకొద్దు అని రౌడీలకు చెబుతాడు మంత్రి.

ఇంతలో రాజ్ కాల్ చేసి డాక్టర్ చక్రవర్తి కేవలం డెలివరి మాత్రమే చేశాడు. అదే నువ్ డీల్ కుదుర్చుకున్న హెడ్ నర్స్ నీలవేణితో మీ భార్యకు నిజం చెప్పిస్తే ఎలా ఉంటుంది. అందుకే హాస్పిటల్‌లోకి నీలవేణి దగ్గరికి వెళ్తున్నాం అని రాజ్ అంటాడు. దాంతో మంత్రి కంగారుగా వెళ్లిపోతాడు. తర్వాత ఉన్న ఇద్దరు రౌడీలను చితకబాది డాక్టర్ చక్రవర్తి కట్టు విప్పి కాపాడి తీసుకెళ్తాడు రాజ్.

మరోవైపు నీలవేణి దగ్గరికి మంత్రి ధర్మేంద్ర వెళ్తాడు. గదిలో ఎవరున్నారని చూస్తాడు. కానీ, ఎవరుండరు. మీరేంటీ ఇక్కడికి వచ్చారని నీలవేణి అడిగితే.. నీ గొ...