భారతదేశం, ఫిబ్రవరి 4 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 947వ ఎపిసోడ్ లో మంత్రి ధర్మేంద్ర భార్యను కనిపించకుండా చేసి తమ ప్లాన్ సక్సెస్ చేస్తారు రాజ్, కావ్య. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన ధర్మేంద్రకు దిమ్మదిరిగే షాకిస్తారు. దీంతో చివరికి తన పాపను కావ్యకు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ దుగ్గిరాల ఇంటికి మంత్రి ధర్మేంద్ర వచ్చి వారికి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. మీ ఇంట్లో ఆరు శవాలు లేచేవి.. అందరూ కొద్దిలో తప్పించుకున్నారు.. ఇలా ఎందుకు జరిగిందో మీ కొడుకు రాజ్, కోడలు కావ్యకు తెలుసు.. వాళ్లను అడగండి.. మరోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే మీ ఇంట్లో ఎవరూ మిగలరు అని ధర్మేంద్ర చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. రాజ్ అతని కాలర్ పట్టుకొని అడిగినా అతడు వెనక్కి తగ్గడు. జాగ్రత్త అని చెప్పి వెళ్లి...