భారతదేశం, ఫిబ్రవరి 3 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 946వ ఎపిసోడ్ రక్తికట్టించింది. రాజ్, మంత్రి ధర్మేంద్ర మధ్య ఫైట్ పర్సనల్‌గా మారి ఇంట్లో వాళ్లను ప్రమాదంలో పడేసింది. ఇటు మంత్రి భార్య తులసికి నిజం చెప్పించడానికి ఆమెను కిడ్నాప్ చేస్తాడు రాజ్. దీంతో ఈ సీరియల్ లో కీలకమైన ట్విస్ట్ వచ్చింది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ మంత్రి ఇంటికి వెళ్లి అతనికే రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలైంది. తన పాపను కాసేపు ఎత్తుకొని ఎమోషనల్ అవుతుంది కావ్య. ఆ తర్వాత తులసి వెళ్లిపోతుంది. అప్పుడే ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నీకు 15 రోజుల టైమ్ ఇచ్చింది.. ఆ లోపు నువ్వు తప్పు ఒప్పుకొని బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో నీకూ తెలుసు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ఇటు దుగ్గిరాల ఇంట్లో పాప బారసాల కోసం ప్లాన్...