భారతదేశం, ఫిబ్రవరి 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పాప ఏడుస్తుంటే నన్ను పాలు పట్టమంటారా అని కావ్య అంటుంది. మీకు అభ్యంతరం లేకుంటేనే అని కావ్య అంటుంది. పాప ఆకలి తీర్చడానికి అలా అంటున్నారని తెలుసు. కానీ, వేరే వాళ్ల పాలు ఇవ్వొచ్చా అని తులసి అంటుంటే.. సమస్య ఏముండదు అని డాక్టర్ అంటుంది. దాంతో తులసి ఒప్పుకుంటుంది.

తన సొంత బిడ్డను తీసుకుని వేరే గదిలోకి వెళ్లి పాలు ఇస్తుంది కావ్య. రాజ్ నుంచి తన కన్నబిడ్డను తీసుకుని ఆడిస్తుంది తులసి. ఈ సీన్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. కావ్య తన పాలకు ఇస్తూ మురిసిపోతూనే బాధపడుతుంది. తర్వాత రాజ్ చెప్పడంతో పాపను తీసుకొచ్చి తులసికి ఇస్తుంది కావ్య. మీ వల్లే పాప కడుపు నిండింది అని థ్యాంక్స్ చెబుతుంది తులసి.

కావ్య చాలా కష్టంగా పాపను ఇస్తుంది. నాకోసం ఇంత చేసిన మీకు ఏదైనా చేయాలని ఉందని, ఓసారి మా ఇంటికి రండి. మా వ...