Hyderabad, ఆగస్టు 15 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే శుక్రవారం (ఆగస్టు 15) 801వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం కోసం రాజ్ ను రప్పించడం, అటు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం, ఇద్దరూ కొత్త ప్లాన్ వేయడంలాంటి సీన్స్ కనిపిస్తాయి.

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రేవతితో అపర్ణ మాట్లాడే సీన్ తోనే మొదలవుతుంది. స్వరాజ్ లాంటి కొడుకు ఉండటం మీ అదృష్టం అని రేవతితో అపర్ణ అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత రాజ్ ను ఇంటికి రప్పించడానికి స్వరాజ్ మంచి అవకాశం అని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. కానీ స్వరాజ్ అడ్రెస్ రాజ్ కు తెలియదు కదా అని అపర్ణ అంటుంది. దీంతో నాకు తెలుసు అని నోరు జారిన ఇందిరాదేవి తర్వాత కవర్ చేసుకుంటుంది.

మరోవైపు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతుంది. దీంతో యామిని ఎంత...