భారతదేశం, అక్టోబర్ 28 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 863వ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్లే జరిగాయి. కావ్య ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా చాలా వింతగా ప్రవర్తించడం ఓవైపు, అప్పు, కల్యాణ్ రొమాన్స్ మరోవైపు.. రాహుల్, స్వప్న విడాకుల గోల ఇంకోవైపు.. ఇలా ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగిపోయింది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ కావ్య, రాజ్ మధ్య జరిగే సరదా పోట్లాటతో మొదలవుతుంది. యోగా చేయడానికి సిద్ధమవుతున్న కావ్యను రాజ్ తిడతాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇది అవసరమా అని నిలదీస్తాడు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే అని కావ్య అంటుంది.

ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని రాజ్ అంటాడు. ఇద్దరి మధ్యా సరదాగా మాటా మాటా పెరుగుతుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏమయింది.. ఈ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. కావ్య చనిపోయే విషయం అ...