భారతదేశం, జూలై 5 -- ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన గృహ రుణాల వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. గతంలో 7.50% ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు సంవత్సరానికి 7.45%కు తగ్గించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా, కొత్తగా రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా రద్దు చేసినట్లు బ్యాంక్​ ఆఫ్​ బరోడా తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్‌లో తమ గృహ రుణ వడ్డీ రేట్లను 8.00% నుంచి 7.50%కు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు 7.45శాతానికి తీసుకొచ్చింది.

ఈ తాజా తగ్గింపుతో గృహ కొనుగోలు మరింత సరసమైనదిగా మారుతుందని, దేశంలో గృహ నిర్మాణ రంగంలో డిమాండ్‌ను పెంచాలనే ప్రభుత్వ ఆర్థిక లక్ష్యానికి ఇది మద్దతునిస్తుందని భావిస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముడాలియార్ మా...