భారతదేశం, జూన్ 4 -- డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా మనకు ఎదురవుతుందో చెప్పలేము. అందుకే ఒక ఎమర్జెన్సీ ఫండ్​ పెట్టుకోవాలి. చాలా మంది దీనిని నిర్లక్షం చేస్తుంటారు. చివరికి, అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్​ లోన్​వైపు చూస్తుంటారు. సాధారణంగా ఈ పర్సనల్​ లోన్స్​లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అది మన ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది. కానీ, పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు అతి తక్కువ వడ్డీకే పొందాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అది జరగడానికి మీరు ఏమి చేయాలి? ఏం చేస్తే తక్కువ వడ్డీ రేటుకు లోన్​ లభిస్తుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. అన్నింటికంటే ముందు, మీ పర్సనల్​ లోన్​ ఆవశ్యకతను గుర్తించండి. అది వివాహానికి ఖర్చు చేయడానికా? లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయడానికా? అని తెలుసుకోండి.

2. మీరు మీ అవసరాన్ని గుర్తించిన తర్వాత మ...