భారతదేశం, జూన్ 24 -- డబ్బు అవసరాల కోసం మీరు పర్సనల్​ లోన్​ తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారా? బ్యాంకులు పర్సనల్​ లోన్​ ఇస్తాయన్న విషయం తెలిసిందే. కానీ వ్యక్తిగత రుణం పొందేందుకు ఇంకొన్ని ఆప్షన్స్​ కూడా ఉన్నాయి. మొత్తం మీద 5 ఆప్షన్స్​ నుంచి మీరు పర్సనల్​ లోన్​ పొందవచ్చు. బ్యాంకులు మీ లోన్​ అప్లికేషన్​ని తిరస్కరించినా, మీరు మిగిలిన 4 ఆప్షన్స్​ నుంచి ఎంచుకోవచ్చు. ఆ వివరాలను చూసేయండి..

బ్యాంకులు: పర్సనల్ లోన్‌ల కోసం ప్రజలు ముందుగా బ్యాంకులనే సంప్రదిస్తుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు:

నాన్-బ్యాంకింగ్ ...