Hyderabad, జూలై 1 -- బోల్డ్ టైటిల్, అంతకంటే బోల్డ్ కంటెంట్ తో ఇండియన్ ఓటీటీ స్పేస్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు చివరి సీజన్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది. కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో బోల్డ్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (Four More Shots Please). ముంబైలోని ఓ బార్ లో టెకీలా షాట్స్ తో పరిచయమైన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీతో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే నాలుగోది, చివరి సీజన్ వస్తున్నట్లు ప్రైమ్ వీడియో మంగళవారం (జులై 1) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"సీజన్ ఫినాలే కోసం ఏం చేయాలో చెప్పడానికి వస్తున్నాం. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ త్వరలో...