Hyderabad, మే 5 -- ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాల్సిందే అన్న డిమాండ్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలుసు కదా. అంతలా బోల్డ్ కంటెంట్ ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెళ్తోంది. కొన్నిసార్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ లోనూ బోల్డ్ సీన్లు, బూతులు ఉంటున్నాయి. అయితే మొత్తంగా బోల్డ్ కంటెంట్ కోసమే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అవేంటో చూడండి.

ఉల్లు అంటే గుడ్లగూబ అని అర్థం. ఇండియాలో బోల్డ్ కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇదీ ఒకటి. 2018లో మొదలైంది. ప్రతి వారం ఇందులోకి హాట్ హాట్ వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అంతా ఎ రేటెడ్ కంటెంటే. కేవలం పెద్దలకు మాత్రమే. పిల్లలను అసలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దగ్గరికి కూడా వెళ్లనీయొద్దు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత...