భారతదేశం, జూలై 26 -- ఇండియాలో చౌకైన 7 సీటర్​ ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందిన రెనాల్ట్​ ట్రైబర్​కి ఇటీవలే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ అయిన విషయం తెలిసింది. ఈ 2025 రెనాల్ట్ ట్రైబర్‌లో పాత మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. అంతేకాకుండా సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక ఇప్పుడు రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్.

రెనాల్ట్ ట్రైబర్ ఆథెంటిక్ వేరియంట్‌లో రెండో వరుస సీటుకు స్లయిడ్, రిక్లైన్, ఫోల్డ్- టంబుల్ వంటి ఫీచర్లు, రిమూవెబుల్​ థర్డ్​-రో ఈజీ ఫిక్స్ ...