భారతదేశం, అక్టోబర్ 11 -- ఎంజీ విండ్సర్​ ఈవీ ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా కొనసాగుతోంది. ఈ తరుణంలో.. ఎంజీ ఇండియా తన విండ్సర్ ఈవీ శ్రేణిలోకి కొత్తగా 'ఇన్​స్పైర్​ ఎడిషన్'ను జోడించింది. దీని ఎక్స్​షోరూమ్ ధర రూ. 16.65 లక్షలు. ఇది విండ్సర్ ఈవీ తక్కువ ధర వేరియంట్​కి పైన.. ఎక్కువ రేంజ్ ఉన్న 'ప్రో' మోడల్‌కి కింద ఉంటుంది.

ఎంట్రీ-లెవల్ విండ్సర్ ఈవీ ధర సుమారు రూ. 13.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఎక్కువ రేంజ్‌ను కోరుకునే వారి కోసం ఉద్దేశించిన 'ప్రో' మోడల్ ధర సుమారు రూ. 18.10 లక్షల వద్ద ఉంది.

కొత్త 'ఇన్​స్పైర్​ ఎడిషన్​'ను ప్రవేశపెట్టడం ద్వారా.. ఎంజీ సంస్థ ఎంట్రీ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది.

డిజైన్ పరంగా, మూడు వెర్షన్లు (స్టాండర్డ్, ఇన్​స్పైర్​, ప్రో) ఒకే బాడీ నిర్మాణాన్ని,...