భారతదేశం, మే 12 -- కియా క్యారెన్స్​ ఎంపీవీకి ప్రీమియం వర్షెన్​గా ఇటీవలే ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది కియా క్యారెన్స్​ క్లావిస్​. ఈ మోడల్​కి సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో మీ సమీపంలోని డిలర్​షిప్​ షోరూమ్​లో కియా క్యారెన్స్​ క్లావిస్​ని బుక్​ చేసుకోవచ్చు. మూడు ఇంజిన్​ ఆప్షన్లు ( 1.5 లీటర్ ఎన్​ఏ పెట్రోల్ (113 బీహెచ్​పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (158 బీహెచ్​పీ), 1.5 లీటర్ డీజిల్ (114 బీహెచ్​పీ), 7 వేరియంట్లలో ఈ ఎంపీవీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కియా క్యారెన్స్​ క్లావిస్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా క్యారెన్స్ క్లావిస్ బేస్ వేరియంట్​ పేరు హెచ్​టీఈ. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్​మెంట్ (వీఎస్ఎం), ఆరు ఎయిర్​బ్యా...