భారతదేశం, ఆగస్టు 10 -- బెంగళూరు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో యెల్లో లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. బెంగళూరు నగర రవాణా వ్యవస్థలో ఇది ఒక కీలకమైన ముందడుగు కానుంది. దాదాపు రూ. 5,057 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 19.15 కిలోమీటర్ల మెట్రో లైన్​.. దక్షిణ బెంగళూరులోని ఆర్‌వీ రోడ్ నుంచి తూర్పు బెంగళూరులోని బొమ్మసంద్ర వరకు 16 ఎలివేటెడ్ స్టేషన్లతో విస్తరించి ఉంది.

ఈ యెల్లో లైన్ ప్రారంభంతో ముఖ్యమైన ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డు, బీటీఎం లేఅవుట్‌లకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. దీంతో ప్రధాన టెక్, ఇండస్ట్రియల్ హబ్‌లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ముఖ్యంగా సిల్క్ బోర్డు జంక్షన్ వంటి రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

సోమవారం నుంచి బెంగళూరు ...